పెళ్లి భోజనానికి వచ్చి ప్లేట్‌లో వదిలేసింది చూస్తే..

పెళ్లి భోజనానికి వచ్చి ప్లేట్‌లో వదిలేసింది చూస్తే..

సూటు బూటు వేసుకుని పెళ్లికి వెళ్లారు. వారిచ్చిన గ్రాండ్ డిన్నర్‌ని శుభ్రంగా తిన్నారు. పోతూ పోతూ వారు చేసిన పని వాళ్లెంత చీపో తెలియజేసింది. ప్లేట్‌లో వారు వదిలేసిన ఐటెంని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అది చూసిన నెటిజన్స్ సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ ఇలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్య అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. మలేసియాకు చెందిన దంపతులు చంకలో పిల్లాడ్ని వేసుకుని పెళ్లికి వెళ్లారు. వివాహ తంతు ముగిసిన తరువాత భోజనాలు ఏర్పాటు చేశారు పెళ్లివారు. పెద్ద లాంజ్‌లో అక్కడక్కడా టేబుల్స్ ఎరేంజ్ చేశారు డిన్నర్ కోసమని. భోజనం చేసిన తరువాత పిల్లాడి డైపర్‌ని తీసి ప్లేట్‌లో పెట్టి ఎంచక్కా వెళ్లిపోయారు దంపతులు. ఈ విషయాన్ని గమనించి పెళ్లికి హాజరైన మరో వ్యక్తి తన మొబైల్ ద్వారా ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 'వివాహానికి హాజరైన తెలివి తక్కువ అతిథి' అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ట్వీట్‌కు ఇప్పటికే 7 వేలకు పైగా రీట్వీట్స్, 2 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇక అది చూసిన నెటిజన్స్ ఆ జంటను ఒక ఆట ఆడుకున్నారు. వారిని స్కూల్‌కు పంపించి సభ్యత, సంస్కారం నేర్పించమని కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story