రైతు ప్రాణం తీసిన యూరియా

X
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కొరత రైతును బలి తీసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఎల్లయ్య అనే రైతు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్థానిక రైతులు.. ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు రైతులు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
