సైరా సందడి మొదలు కాబోతోంది..

సైరా సందడి మొదలు కాబోతోంది..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడుగా చెప్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మించారు. బాలీవుడ్ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు తమన్నా, జగపతిబాబు, రవి కిషన్ కూడా నటించారు. నయనతార హీరోయిన్ గా నటించింది.

సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో సైరా విడుదలకు రెడీ అవుతోంది. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలతో సైరాపై అన్ని ఇండస్ట్రీస్ లోనూ బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందంటున్నారు. దసరా హాలిడేస్ టైమ్ లో ఈ సినిమా వస్తోంది కాబట్టి, భారీ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు.

సైరా రిలీజ్ కి ఇంకా 25 రోజుల టైమ్ మాత్రమే ఉంది. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ నెల 15 లేదా 17న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, కర్నూల్ లో నిర్వహించనుందని సమాచారం. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లను గెస్ట్ లుగా పిలిచే ఆలోచనలో ఉన్నారు. లక్షలాది అభిమానుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అలాగే బెంగుళూరులోనూ ఓ పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట. వీటితో పాటు చిరంజీవి అండ్ టీమ్ ముంబయి, బెంగళూరు, కొచ్చి, చెన్నైలలో ప్రమోషన్స్ చేయబోతున్నారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story