బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు అవసరమా కామ్రేడ్ ?

బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు అవసరమా కామ్రేడ్ ?

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లోకి స్పీడ్ గా దూసుకువచ్చిన స్టార్. అతని స్పీడ్, టాలెంట్ చూసిన చాలామంది సులువుగా టాప్ లీగ్ లోకి వెళ్లిపోతాడు అనుకున్నారు. కానీ సడెన్ గా బ్రేకులు పడ్డాయి. నోటా, డియర్ కామ్రేడ్ రూపంలో గట్టి షాకులు తగిలాయి. మధ్యలో వచ్చిన టాక్సీవాలా యావరేజ్ అనిపించుకుంది. ఇక సడెన్ గా మళ్లీ స్పీడ్ తగ్గించాడు. మరోవైపు మైత్రీ మూవీస్ వాళ్లకు చేయాల్సిన ‘హీరో’ సినిమా కొంత షూటింగ్ చేసిన తర్వాత ఆపేశారు.

ప్రస్తుతం కెఎస్ రామారావు ప్రొడక్షన్ లో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సెన్సిబుల్ స్టోరీస్ తీయడంలో క్రాంతిమాధవ్ ఎక్స్ పర్ట్. అదే అతని బలం కూడా. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే దర్శకుడు ప్రతిభను బట్టి ఈ సినిమా విజయ్‌కి ఖచ్చితంగా మంచి పేరు తెస్తుందనుకోవచ్చు. విజయ్ ఖాతాలో క్రాంతి మాధవ్ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమా ఉంటుంది. ఈ మూవీకి ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఆ మేరకు యాక్షన్ సీన్స్ కోసం ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు. మరో పక్క తన మెంటార్ తరుణ్ భాస్కర్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా నిర్మిస్తున్నాడు.

ఇంత బిజీగా ఉండి, ఇక్కడ మరింత ప్రూవ్ చేసుకోవాల్సిన టైమ్ లో, బాలీవుడ్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. అది కూడా ఫ్లాప్ మూవీతో అంటున్నారు. తన రీసెంట్ మూవీ డియర్ కామ్రేడ్ బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ తీసుకున్నాడు. ఈ మూవీతోనే కరణ్ .. విజయ్ ని బాలీవుడ్ కు పరిచయం చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఇది ఆగిపోయింది. అందుకే మరో కథతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న ఈ క్రేజీ హీరో ఇక్కడ పాగా వేసే ప్రయత్నాలు చేయకుండా.. బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేయడం రెండు పడవల మీద కాలు వేసినట్లవుతుందంటున్నారు సినీ పండితులు. మరి విజయ్ ఏ డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story