గ్రామ సచివాలయ పరీక్ష రాసిన ఉద్యోగులకు 15 మార్కులు..

పంచాయితీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాతపరీక్షల్లో 15 మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆరు నెలలకూ 1.5 మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కులు రాత పరీక్షల్లో వచ్చిన మార్కులకు కలుపుతామని అన్నారు.
గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల రాత పరీక్షలను షెడ్యూల్ ప్రకారం ఈనెల 7న నిర్వహించనున్నట్లు పంచాయితీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. తమను ఇజనీరింగ్ గ్రేడ్-2 అసిస్టెంట్లుగా నియమించాలని పీఆర్ విభాగంలో కొంతమంది ఔట్‌సోర్పింగ్ సైట్ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. పిటిషనర్ల అభ్యర్ధనను ప్రభుత్వం 2 వారాల్లోపు పరిశీలించాలని, అప్పటివరకు ఇంజనీరింగ్ గ్రేడ్-2 అసిస్టెంట్ పోస్టుల నియామకం నిలిపివేయాలని గత నెల 21న హైకోర్టు ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సైట్ ఇంజనీర్ల విజ్ఞప్తిని పరిశీలించిందని, కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Also Watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com