గణేశా.. నువ్ గ్రేటయ్యా.. ముస్లిం దేశ కరెన్సీపై గణపతి

గణేశా.. నువ్ గ్రేటయ్యా.. ముస్లిం దేశ కరెన్సీపై గణపతి

హిందువుల ఆరాధ్య దైవం.. తొలి పూజలు అందుకునే లంబోదరుడు.. ఆ గణ నాయకుడు ముస్లిం దేశంలో కూడా కీర్తింపబడ్డాడు. వారు ఉపయోగించే కరెన్సీ నోట్లపై వినాయకుడి విగ్రహాన్ని ముద్రించేంతగా. బాలీవుడ్ డైరక్టర్ తనుజ్ గార్గ్ ఆనోటుని ట్విట్టర్‌లో పోస్ట్ చేసేవరకు ఎవరికీ ఈ విషయం గురించి అంతగా తెలియదు. ఇంతకీ ఆ దేశం పేరేమిటో తెలుసా.. 87.2 % మంది ముస్లింలు నివసించే ఇండోనేషియా. ఇక్కడ హిందువులు 1.7 శాతం మాత్రమే ఉన్నారు. గార్గ్ ట్వీట్‌లో ఇదే విషయాన్ని పేర్కొంటూ.. ప్రపంచంలో వినాయకుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేషియా అని ట్వీట్ చేశారు.

20 వేల రూపయా నోటుపై ఇండోనేషియా స్వాతంత్ర్య సమరయోధుడు కి హజార్ దేవంతరా చిత్రానికి పక్కనే వినాయకుడి చిత్రాన్ని ముద్రించారు. ముస్లిం దేశంలో వినాయకుడి బొమ్మ ముద్రించి ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే అక్కడి ద్వీపసమూహంలో 1వ శతాబ్దం నుంచి హిందువుల ప్రభావం ఉంది. ఇక్కడ హిందూ దేవుళ్లకు సంబంధించిన ఆలయాలు, విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జకార్తా స్క్వేర్‌లో క్రిష్ణార్జునుల విగ్రహాలు కనిపిస్తాయి. అందుకే ఇండోనేషియాను అందరూ పరమత సహనానికి ప్రతీకగా భావిస్తుంటారు.

Tags

Read MoreRead Less
Next Story