గోదావరి నదికి భారీగా వరద.. రైతుల్లో ఆందోళన

X
గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి వరద ఉధృతి పెరగడంతో 46 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అలాగే అన్నారం బ్యారేజీ ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం వద్ద పరవళ్లు తొక్కుతున్నగోదారమ్మ నిండుకుండలా మారింది. గోదావరికి మరింత భారీగా వరద వస్తే.. పంటలు ముంపుకు గురవుతాయని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
