ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే: కోదండరామ్‌

ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే: కోదండరామ్‌
X

యూరియా కోసం లైన్‌లో నిలబడి రైతు ఎల్లయ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు TJS అధ్యక్షుడు కోదండరామ్‌. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి వెళ్లి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు కోదండరామ్. రైతు చనిపోయి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన రాలేదన్నారు. రైతుల యూరియా క్యూ లైన్లను సినిమా టిక్కెట్ల క్యూ లైన్లతో మంత్రి నిరంజన్‌ రెడ్డి పోల్చడంపై మండిపడ్డారు కోదండరామ్‌.

Tags

Next Story