వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
X

యూరియా కొరత రాష్ట్ర రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది. ఎరువుల కొరతపై ఆగ్రహంతో రగిలిపోయిన అన్నదాతకు మద్దతుగా పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. యూరియా కొరతపై పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం క్యూలో నిలబడి రైతు చనిపోయిన ఘటనపై.. స్పందించిన మంత్రి ఈ ఘటన కేవలం యాదృచ్ఛికమే అన్నారు. సినిమా టికెట్ల కోసం లైన్‌లో నిలబడి చనిపోతే.. థియేటర్లది బాధ్యత అనలేం కదా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Watch Fast News in 3 Minutes :

మరోవైపు ఎరువుల కొరత పాపం మీదంటే మీదంటూ టీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించుకుంటున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన యూరియా తెప్పించాలన్న కనీస సోయి బీజేపీ వాళ్లకు లేదని విమర్శిస్తోంది. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రానిదే బాధ్యతని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే..యూరియా కొరతతో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులకు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటోంది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయంపై ముందస్తు ప్రణాళిక లేదనే లైన్లో యూరియా ఇష్యూలో చేతులు దులిపేసుకుంటోంది.

ఆస్పత్రి బాటతో రాష్ట్రంలో రోగాలను హైలెట్ చేసిన కాంగ్రెస్.. యూరియా ఇష్యూలోనూ ప్రభుత్వంపై విమర్శలు పెంచింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో యూరియా కోసం లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన ఘటన తనను కలచివేసిందన్నారు భట్టి విక్రమార్క. సిద్ధిపేట మోడల్‌ అని చెప్పుకునే కేసీఆర్‌ ఈ ఘటనను చూసి సిగ్గుపడాలన్నారు.

ఇన్నాళ్లు గోడౌన్లు, పంపిణీ కేంద్రాల దగ్గర రాజుకున్న యూరియా వార్.. పొలిటికల్ వార్ గా మలుపు తిరిగింది. దుబ్బాక ఘటనపై స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే వివాదస్పద వ్యాఖ్యలు చేయటం ప్రతిపక్షాలకు అస్త్రం అందించినట్టుగా మారింది.

Tags

Next Story