అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఓక్లాలోని టర్నర్ జలపాతంలో ఈతకు వెళ్లిన తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. వీరిలో ఒకరు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన 23 ఏళ్ల ఓలేటి కౌశిక్ కాగా మరొకరు నెల్లూరుకు చెందిన కేదార్ నాథ్ రెడ్డి.
కౌశిక్ అల్ లింటన్ నగరంలోని టెక్సాస్ యూనివర్సిటీలో MS చదువుతున్నాడు. కర్ణాటకకు చెందిన మరో మిత్రుడు అజయ్ కుమార్‌తో కలిసి కేదార్‌నాథ్ రెడ్డి అందరూ టర్నర్ ఫాల్స్ జలపాతానికి వెళ్లారు. దాదాపు 13 అడుగుల లోతులో ఈత కొడుతూ.. కౌశిక్, కేదార్ నీట మునిగి చనిపోయారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పిల్లలు అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతదేహాలు స్వస్థలానికి చేరడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com