ఆప్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అల్కా లంబా

ఆప్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అల్కా లంబా
X

ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అల్కా లంబా.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ఆప్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది. రాజీనామాను ఆమోదించండి అంటూ పార్టీ నాయకత్వాన్ని కోరారు. రాజీనామాను ట్వీట్టర్‌లో పెట్టినప్పటికీ ఆమోదిస్తామని ఆప్‌ అధికార ప్రతినిధి గతంలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆప్ పేదల పార్టీ కాదు.. బంధు ప్రీతి పార్టీ అని విమర్శించారు అల్కా లంబా.

ఈ ఆరేళ్ల కాలంలో ఆప్‌లో ఉండి ఎంతో నేర్చుకున్నానని ట్వీట్‌ చేశారు అల్కా లంబా. ఇటీవలే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించారు. దీంతో అల్కా త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ చాందినీ చౌక్‌ నియోజకవర్గం నుంచే అల్కా లంబా పోటీ చేస్తారని సమాచారం.

ఆప్‌లో చేరడానికి ముందు అల్కా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి బాధ్యత తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ను డిమాండ్ చేసింది అల్కా . దీంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆమెను తొలగించారు. అప్పటి నుంచి అల్కా పార్టీ వీడుతారన్న ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు.

Also watch :

Tags

Next Story