గొర్రె ఎంత పని చేసింది.. అందరూ చూస్తుండగానే..

సరదాగా చేసిందో లేక కావాలనే చేసిందో తెలియదు కానీ ఓ గొర్రె చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూట్‌కు సిద్దమవుతున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను అది తన కొమ్ములతో కుమ్మేసింది. దాని దెబ్బకు కెమెరామెన్ కింద పడిపోయి అబ్బా అని అనాల్సి వచ్చింది. ఈ సంఘటన నైరుతి ఇంగ్లండ్‌లోని వైల్ట్‌షైర్ జంతువుల పార్కులో చోటుచేసుకుంది. "వన్యప్రాణుల జీవితంలోని అనూహ్య దృశ్యాల ఆవిష్కరణ" పేరుతో ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం వైల్ట్‌షైర్‌లోని పార్కులోని జంతువులను చిత్రీకరించేందుకు ఛానల్ టీం అక్కడికి వెళ్ళింది. ముందుగా అక్కడ ఉన్న సిసిల్ అనే గొర్రె గురించి నిర్వాహుకులను అడిగి తెలుసుకుంటోంది ఆ టీమ్. అది చాలా మొండిదని, ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వెంటనే వాళ్ల పనిపడుతుందని సిబ్బంది వివరిస్తున్నారు. ఈ క్రమంలో దానిని కెమెరాలో బంధించడానికి బీబీసీ కెమెరామెన్ సిద్దమవుతున్న సమయంలో అది నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి కోమ్ములతో విరుచుకుపడింది. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా హతాశులయ్యారు. చివరకు పార్కు నిర్వాహకులు కలుగజేసుకుని దాన్ని పిలవడంతో అది శాంతించి వెనక్కి వచ్చింది. ఈ తతంగాన్నంతా పక్కనే ఉండి గమనిస్తున్న వారంతా నవ్వడంతో కెమెరామెన్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.
RELATED STORIES
Shalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్‌కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్‌గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMT