రూ. 24,999 కే 49 ఇంచెస్ టీవీ.. ఫీచర్లు చూస్తే..

రూ. 24,999 కే 49 ఇంచెస్ టీవీ.. ఫీచర్లు చూస్తే..

తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందించేందుకు జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్ సంస్ధ ముందుకు వచ్చింది. కేవలం రూ.24,999కే 49 ఇంచుల డిస్‌ప్లే కలిగిన టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది బ్లౌపంక్ట్ కంపెనీ. హెడ్‌ఫోన్స్, సౌండ్ బార్‌లను తయారు చేసిన ఈ కంపెనీ రెండు రకాల టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారులకు అతి తక్కువ ధరకే టీవీ అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంస్ధ జెన్ జడ్ సిరీస్‌లో విడుదల చేసిన 43 ఇంచుల టీవీ ధర రూ.19,999 కాగా 49 ఇంచుల టీవీ ధర రూ.24,999గా నిర్ణయించారు. వీటిలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్, 8 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ ఓఎస్, 1 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను ఇందులో చేర్చారు. ఇంకా వీడియో స్ట్రీమింగ్‌తో పాటు వైఫై ఫీచర్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుంచి ఇవి ప్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి. గతంలో చిన్న సైజు టీవీలను అందించిన బ్లౌపంక్ట్ తాజాగా అతిపెద్ద టీవీని వినియోగదారుల కోసం మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story