నాలుగు బంతుల్లో నలుగురు ఔట్.. రికార్డ్ సృష్టించిన మలింగ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే బౌలింగ్ ప్రదర్శించాడు. సూపర్ యార్కర్లతో విరుచుకుపడ్డ మలింగ వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవరలో మూడో బంతికి మన్రోను ఎల్బీ చేసిన మలింగ.. ఆ తర్వత వరుసగా రూథర్‌ఫోర్ట్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను పెవిలియన్ బాట పట్టించాడు.
మలింగ కెరీర్‌లో ఇలాంటి ఫీట్ రెండోది. 2007వన్డే ప్రపంచకప్‌లో మలింగ దక్షిణాప్రికాపై ఇదే రీతిలో చెలరేగిపోయాడు. 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పడదే రీతిలో టీ20ల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేశారు. మరో వైపు అంతర్జాతీయ క్రికెట్‌లో 5సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా మలింగ రికార్డు నెలకొల్పారు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన కీవిస్ మలింగ దెబ్బకు 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. దీంతో 37 పరుగుల తేడాతో శ్రీలంక నెగ్గింది. అయితే సీరిస్ మాత్రం 2-1 తేడాతో కీవిస్ దక్కించుకుంది.
Also watch :
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com