అంతర్జాతీయం

క్యాచ్ సూపర్ క్యాచ్.. ఆకాశానికి భూమికి మధ్య అరుదైన సంఘటన

క్యాచ్ సూపర్ క్యాచ్.. ఆకాశానికి భూమికి మధ్య అరుదైన సంఘటన
X

క్యాచ్ సూపర్ క్యాచ్.. కానీ ఇది క్రికెట్‌లో కాదు. రోలర్ కోస్టర్‌లో కూర్చొని ఓ వ్యక్తి పట్టిన క్యాచ్. ప్రస్తుతం ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేల పై నుంచి ఆటగాళ్ళు గాల్లోకి ఎగిరి పట్టిన బంతినిపట్టుకోవడం మాత్రం మనం చూశాం. పైనుంచి వేగంగా కింద పడుతున్న ఫోన్‌ను ఓ వ్యక్తి క్యాచ్ పట్టిన తీరు నెటిజన్స్‌ని సర్‌ప్రైజ్ చెస్తోంది...

శామ్యూల్ కెంఫ్ అనే వ్యక్తి స్పెయిన్‌లోని పోర్ట్‌అవెంచురా వరల్డ్ థీమ్ పార్క్‌ను సందర్శించాడు. పార్కులో ఉన్న రోలర్ కోస్టర్‌లలో ఒకటైన శంభాల రైడ్‌నుఎక్కాడు. శామ్యూల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తనకంటే కొన్ని సీట్ల ముందు కూర్చున్న వ్యక్తి ఫోన్‌ కిందపడటం గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ఆ ఫోన్‌ను గాల్లోనే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. దీన్ని పార్క్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.శామ్యూల్‌ పట్టిన క్యాచ్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శామ్యూల్‌ ‘నిజంగా నువ్వు లెజెండ్‌వి’ అంటూ ప్రశంసిస్తున్నారు

Next Story

RELATED STORIES