సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వా

సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వా
X

ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పాకిస్థాన్ తీరు మాత్రం మారడం లేదు. ఏ చిన్న అవకాశం దక్కినా భారత్‌పై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కుతోంది. తాజాగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశాడు..త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగాడు. కశ్మీర్‌ లోయలో భారత్‌ విధ్వంసాలకు పాల్పడుతోందని.. హిందుత్వాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు.

కశ్మీర్‌.. పాక్‌ ముఖ్య ఎజెండా. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం సవాలుగా భావిస్తున్నామని బజ్వా అన్నారు. కశ్మీర్‌ను వదిలే ప్రసక్తే లేదు. మా ప్రతి సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బుల్లెట్‌, చివరి శ్వాస ఆగే వరకూ కశ్మీర్‌ కోసం పోరాడుతూనే ఉంటాడంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. కశ్మీర్‌ ప్రజలకు భరోసా ఇస్తున్నామని.. కశ్మీర్‌ కోసం యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నామని ప్రకటించాడు.

Also watch :

Tags

Next Story