కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకొని ఓదార్చిన ప్రధాని

కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకొని ఓదార్చిన ప్రధాని
X

ఇస్రో శాస్త్రవేత్తల కృషిని చూసి దేశం గర్విస్తోందన్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్‌-2 విషయంలో వాళ్లెంత బాధపడుతున్నారో తనకు తెలుసన్నారు. బెంగళూరులోని ఇస్రో ఆపరేటర్‌ సెంటర్‌లో సైంటిస్టులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. శాస్త్రవేత్తల కృషి ఎప్పటికి వమ్ము కాదన్నారు. చంద్రయాన్‌ యాత్ర అద్భుతంగా కొనసాగిందన్నారు.

శాస్త్రవేత్తలు అధైర్యపడొద్దని.. ఇండియా మీతోనే ఉందని వారిలో భరోసా కల్పించారు మోదీ. శాస్త్రవేత్తల కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. రాబోయే ప్రయోగాల్లో మన సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు ప్రధాని.

ప్రసంగం అనంతరం మోదీ తిరిగి వెళ్తుండగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో శివన్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు ప్రధాని మోదీ. ధైర్యంగా ఉండాలని వెన్ను తట్టారు.

Tags

Next Story