వైసీపీ వాళ్ళు జోక్ చేశారు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ వంద రోజుల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ మద్దతుదారులను ఎలా బెదిరిస్తున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలని ట్వీట్ చేశారు. అందులో టీడీపీ మద్దతుదారుడికి వచ్చిన బెదిరింపులను ట్విట్టర్‌లో పెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు ప్రస్తుత ప్రభుత్వం పునః సమీక్షించడం ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని బాబు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 9 వేల కోట్ల రూపాయల పనులు నిలిచిపోయాయని ఓ CEO అన్నారని గుర్తు చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని పారిశ్రామిక వేత్తలు పేర్కొనడం మీకు వినపడలేదా అని చురకలంటించారు బాబు.
వైసీపీ వంద రోజుల పాలనలో శాంతిభద్రతలు బాగున్నాయంటూ ఆ పార్టీ నాయకులెవరో జోక్ పేల్చారని బాబు ట్వీట్ చేశారు. పాలన అంత అద్భుతంగా ఉంటే తాము వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాస కేంద్రం పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు.
వైసీపీ కార్యకర్తల పేరిట ప్రైవేటు రౌడీ రాజ్యమే నడుస్తోందా అనిపిస్తుందన్నారు చంద్రబాబు. బెదిరించిన వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

