ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నాం : లక్ష్మణ్

ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నాం : లక్ష్మణ్
X

కేసీఆర్ పాలన నయా నిజాంను తలపిస్తోందని ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. యాదాద్రి ఆలయ ప్రాకార స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కించడం అంటే భక్తులను అవమాన పరచడమేనని అన్నారు. స్వామి దర్శనంతోపాటు తన దర్శనం కూడా కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారా అని నిలదీశారు లక్ష్మణ్. ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని ఈలోగా అన్ని సరిదిద్దాలన్నారు. కేసీఆర్, కారు చిత్రాలను ఉద్దేశపూర్వకంగానే చెక్కించారని..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

అంతకుముందు యాదాద్రిలో ఉద్రిక్తత తలెత్తింది..రాయగిరి నుంచి యాదాద్రి వరకు బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బారికేడ్లను దాటుకొని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story