ఆస్తికోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఆగిన కన్నతల్లి అంత్యక్రియలు

ఆస్తికోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఆగిన కన్నతల్లి అంత్యక్రియలు

ఆస్తికోసం ఇద్దరు భార్యల గొడవతో కన్నతల్లి అంత్యక్రియలు ఆగిపోయాయి. మూడు రోజులు గడుస్తున్నా దహనం చేయని పరిస్థితిని నెలకొంది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా సైదాపురం మండలం రాములపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చింతకుంట వీరలక్ష్మి మూడు రోజుల కిందట అనారోగ్యంతో చనిపోయింది. కాగా వీరలక్ష్మి కొడుకైనా మైపాల్ రెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య అయిన సుకృతకు ఒక అమ్మాయి ఉంది. రెండో భార్య అయిన రమాదేవికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే చనిపోయిన వీరలక్ష్మి పేరున ఉన్న ఎకరం భూమిని మైపాల్ రెడ్డి.. రెండో భార్యకొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో ఎకరం భూమిలో తమకు కూడా వాటా వస్తుందని గొడవకు దిగింది మొదటి భార్య. ఇద్దరి భార్యల మధ్య గొడవతో వీరలక్ష్మి అంత్యక్రియలు మూడు రోజులుగా ఆగిపోయాయి.. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలు వేసుకుంటున్నారు..

Tags

Read MoreRead Less
Next Story