టీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక పోరాటమే అంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. జనం విష జ్వరాలతో అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. సోమవారం జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను పరిశీలించి.. అక్కడి నాసిరకం చికిత్సను జనాలకు తెలిసేలా చేస్తామన్నారు. రైతు సమస్యలపై 11న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ చెప్పారు.

యాదాద్రి క్షేత్రంలో రాజకీయ నేతల ప్రతిమలను, పార్టీ గుర్తులను చెక్కటంపైనా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేసీఆర్ ఆహంకారానికి నిదర్శనమని అన్నారాయన. శిలలపై పార్టీల చిహ్నాలు ఎలా వచ్చాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story