తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఓవైపు అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌కు ప‌దును పెడుతూనే .. మ‌రో వైపు గులాబీ స‌ర్కారుపై క్షేత్రస్థాయి పోరాటాల‌కు సిద్ధమవుతోంది. యాక్షన్ ప్లాన్ రెడీ చేసేందుకు భేటీ అయిన పీసీసీ కోర్ క‌మిటీ .. ముఖ్యనేత‌ల అందరికి కీలక బాధ్యతలు అప్పగించింది.

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో .. తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అంశాల వారీగా స‌ర్కారును ఇరుకున పెట్టేందుకు సీఎల్పీ సిద్దమవుతుంది. ప్రజ‌లు విష‌జ్వరాల బారిన ప‌డ్డా .. ప్రభుత్వం తక్షణ చర్యలపై నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని స‌భ‌లో లేవ‌నెత్తుతామ‌ని చెబుతున్నారు.

మ‌రో వైపు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన సమస్యలపై అందరిని ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయ‌త్నాల‌ు మొద‌లు పెట్టారు సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క. ఇందుకు జిల్లా నేత‌ల‌తో ప్రత్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి పార్టీ ముఖ్యనేతలు సైతం హ‌జ‌రైయ్యారు. ఈ భేటిలో అసెంబ్లీలో ఏఏ అంశాలతో ముందుకెళ్ళాలనే దానిపై అంద‌రి అభిప్రాయాలను తీసుకున్నారు.

అలాగే నల్లమల్లలో యురేనియం త‌వ్వకాల‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ .. దీనిపై సీరియ‌స్‌గా ఫైట్ చేయాల‌ని నిర్ణయించింది. ఇక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిల‌దీసేందుకు క్షేత్రస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక సాగునీటి ప్రాజెక్ట్ అంశంలో కేసీఆర్ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌డుతున్న కాంగ్రెస్ .. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని సీరియ‌స్ ఇష్యూగా టేక‌ప్ చేయ‌నుంది. సింగూరు,మంజీరా ఎండిపోయి సంగారెడ్డి జిల్లా అంతా దాహం దాహం అంటూ అలమటిస్తోందని అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ ఇప్పటికైనా స్పందించ‌కపోతే చ‌లో అసెంబ్లీ త‌ప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story