చంద్రయాన్-2లో ఇస్రో పురోగతి.. లొకేషన్ ట్రేస్

చంద్రయాన్-2లో ఇస్రో పురోగతి సాధించింది. నిన్న చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్ కట్ అయి దారి తప్పిన విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో గుర్తించింది. ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్లు ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ శివన్. ప్రస్తుతం ల్యాండర్‌తో కమ్యూనికేషన్ లేదని.. రెండు మూడు రోజుల్లో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు శివన్.
నిన్న జాబిల్లిని ముద్దాడేందుకు అతి దగ్గరకు వెళ్లిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్ మిస్ అయ్యింది. అన్ని అడ్డంకులనూ విజయవంతంగా అధిగమిస్తూ ముందుకుసాగిన ల్యాండర్.. చివరి నిమిషంలో తడబడింది. దీంతో విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యిందా? లేక హార్ట్ ల్యాండ్ అయ్యిందా తెలియని అయోమయం నెలకొంది. సరిగ్గా 40 గంటల తరువాత ల్యాండర్ లోకేషన్‌ను ఆర్పిటర్ గుర్తించడంతో సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com