పూర్తిస్థాయిలో కొలువుదీరిన తెలంగాణ కేబినెట్..

పూర్తిస్థాయిలో కొలువుదీరిన తెలంగాణ కేబినెట్..

తెలంగాణ కేబినేట్‌ విస్తరణ పూర్తైంది. రాజ్‌భవన్‌లో మొత్తం ఆరుగురు కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కూడా కేటాయించారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌తో కలిపి మంత్రి వర్గంలో 12 మంది ఉండగా... తాజాగా ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18కి చేరింది. సామాజిక సమీకరణాలతో పాటు అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగే విధంగా కేసీఆర్‌ మంత్రి వర్గ కూర్పు చేశారు.

మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఫొటో సెషన్‌ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీఎం కేసీఆర్‌తో కలిసి మంత్రులంతా గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిని గవర్నర్‌కు పరిచయం చేశారు సీఎం కేసీఆర్‌.

మంత్రుల ప్రమాణస్వీకారంతో రాజ్‌ భవన్‌ సందడిగా మారింది. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, అధికారులు హాజరయ్యారు. కేబినెట్‌ విస్తరణతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story