'సైరా' లో హైలెట్స్ ఇవేనా...?

సైరా లో హైలెట్స్ ఇవేనా...?

మెగాస్టార్ మెగా మూవీ సైరా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కి ఇంకా మూడు వారాలే గడువు ఉండటంతో, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది టీమ్. ముందుగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ రిలీజైన తర్వాత కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇది చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. దీని తరువాత బెంగళూరులో కూడా భారీ పబ్లిక్ ఫంక్షన్ వుంది. చెన్నై, ముంబైలోనూ ఈవెంట్స్ చేసే ఆలోచనలో ఉంది సైరా టీమ్.

ఇండస్ట్రీ వర్గాల్లో సైరాలో హైలైట్స్ అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వినిపిస్తున్నాయి. సైరా టైటిల్ సాంగ్ సినిమా చూసే ఆడియన్స్ కి ఊపు తెప్పిస్తుందంటున్నారు. స్టార్ కాస్టింగ్ ఎక్కువగా ఉండటం వల్ల, సినిమా అంతా గ్రాండ్ గా ఉండబోతుందంటున్నారు. స్టోరీ ప్రకారం అండర్ వాటర్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అంటున్నారు. విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ ల పాత్రలు హైలైట్ గా ఉంటాయట. సినిమాలో జాతర పాటకి మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్మకంతో ఉంది టీమ్. అనుష్క ఇందులో ఝాన్సీ లక్ష్మీభాయ్ గా నటించింది. పోరాట సన్నివేశాలు మాస్ ని మెప్పిస్తాయట. మొత్తంగా సైరా నరసింహారెడ్డి విజువల్ వండర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

Tags

Read MoreRead Less
Next Story