కొత్త జరిమానాలకు వ్యతిరేకంగా వెరైటీ నిరసన

కొత్త జరిమానాలకు వ్యతిరేకంగా  వెరైటీ నిరసన

కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం చలమణిలోకి వచ్చిన కొత్త భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు జనం. ముందు రోడ్లు బాగు చేయండని కొందరు, గుంతలు పూడ్చాలని మరికొందరు ట్రాఫిక్‌ పోలీసులను ఏకిపారేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వాసి ఓ అడుగు ముందుకేసి వెరైటీగా నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో హెల్మెట్‌ పెట్టుకుని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డ్యూటీ చేశాడు. జరిమానాల పేరుతో జనాల్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఇలా నిరసన తెలుపుతూ TV5 కెమెరాకు చిక్కాడు. సరైన ట్రాఫిక్‌ వ్యవస్థ లేకుండా భారీగా ఫైన్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడు శ్రీనివాస్‌. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలా చేశానన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story