చెల్లిని హత్య చేసిన అన్న

చెల్లిని హత్య చేసిన అన్న

కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో తోబుట్టువునే దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర క్రాస్ వద్ద జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. అమల అనే మహిళ.. భర్త, పిల్లలను విడిచిపెట్టి వేదిరలో బిర్యానీ సెంటర్ నడుపుతోంది. ఈమెకు అన్న అనిల్‌తో ఆస్తి వివాదాలున్నాయి. ఈ గొడవ ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో చెల్లి అమలను అంతమొందించాలని నిర్ణయించాడు అనిల్. ఆమెను చంపేందుకు 3 లక్షల సుపారీ ఇచ్చాడు. తన స్నేహితులైన ఇద్దరితో కలిసి వచ్చి అమలపై కత్తులతో అమానుషంగా దాడి చేసి చంపేశాడు. మృతురాలి శరీరంపై ఏకంగా 40 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story