16 ఏళ్ల కుర్రాడి ప్రతిభకు ప్రధాని ఫిదా

16 ఏళ్ల కుర్రాడి ప్రతిభకు ప్రధాని ఫిదా
X

తల పండిన మహామహులే తర్కించుకుంటారు. వేదాలను ఔపోసాన పట్టాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. సర్వతీదేవి నాలుక మీద నాట్యమాడాలి. అంతటి మహా మహులకూ అనితర సాధ్యమయ్యే వేద వ్యాకరణ గ్రంధాలను 16 ఏళ్లకే ఆసాంతం కంఠతా పట్టేసి అందరి చేతా ఔరా అనిపించుకుంటున్నాడు.. భారత ప్రధాని మోదీ చేత కూడా ప్రశంసలందుకున్నాడు ప్రియవ్రత. కష్టతరమైన 14 రకాల తెనాలి పరీక్షలు దాటుకుని మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దాంతో చిన్న వయసులోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తిగా ప్రియవ్రత చరిత్ర సృష్టించాడు. యువకుడి ప్రతిభా పాటవాల్ని కృష్ణశాస్త్రి అనే వ్యక్తి ప్రధాని మోదీకి ట్విట్టర్‌‌లో వివరించడంతో ఆయన స్పందించారు. చిన్న వయసులో గొప్ప ప్రావీణ్యం సంపాదించావని మోదీ మెచ్చుకున్నారు. ఎంతో కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అద్భుతం చేశావంటూ ప్రియవ్రతకు అభినందనలు తెలియజేశారు. నీ ఉన్నతి మరెందరికో స్ఫూర్తి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు ప్రధాని ట్విట్టర్ ద్వారా. తండ్రి దేవదత్తా పాటిల్, గురువు మోహనశర్మ వద్ద ప్రియవ్రత వేదాధ్యయనం చేస్తున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని నెటిజన్లు సైతం ప్రియవ్రతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also watch :

Tags

Next Story