కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్‌ అందుకున్న రఫెల్‌ నాదల్‌

కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్‌ అందుకున్న రఫెల్‌ నాదల్‌

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రఫ్పాడించాడు రఫెల్‌ నాదల్‌. న్యూయార్క్‌ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో నాదల్‌ విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెద్వెవ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో మట్టి కరిపించాడు నాదల్‌. దీంతో తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్‌ను అందుకున్నాడు.

కెరీర్‌లో తొలిగ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన యువ ఆటగాడు మెద్వెద్వెవ్‌.. నాదల్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. తొలి రెండు సెట్లను నాదల్‌ అలవోకగా నెగ్గినప్పటికీ.. ఆ తరువాత రెండు సెట్లను కైవసం చేసుకుని మెద్వెద్వెవ్‌ రేసులోకి వచ్చాడు. కానీ ఫలితం తేలే ఆఖరి సెట్‌లో మాత్రం నాదల్‌ ముందు తలవంచక తప్పలేదు. చివరి సెట్‌ నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు నాదల్‌. తాజా గెలుపుతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్న రోజర్‌ ఫెదరర్‌కు అడుగు దూరంలో నిలిచాడు రఫెల్‌.

Also Watch

Tags

Read MoreRead Less
Next Story