‘సాహో’ సునామీ.. ఎంత కొల్లగొట్టిందో తెలుసా..?

‘సాహో’ సునామీ.. ఎంత కొల్లగొట్టిందో తెలుసా..?

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. భారీ అంచనాలతో విడుదలైన సాహో కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే 350 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. శనివారం సాయంత్రానికి సాహో.. యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లు) వసూలు చేసింది. ఇప్పటి వరకు బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు మాత్రమే 3 మిలియన్ క్లబ్బులో చేరగా.. తాజాగా ‘సాహో’ ఈ ఫీట్ ను సాధించింది. దీంతో నార్త్‌అమెరికాలో ఈ రికార్డు సాధించిన ఐదో చిత్రంగా సాహో నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్నా సరే.. కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతోంది. ప్రభాస్ స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ లు యువీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story