శవాన్ని వెలికితీసి తల నుండి మొండెం వేరుచేసిన గ్రామపెద్దలు

సూర్యాపేట జిల్లా కొమ్మాల గ్రామంలో దారుణం జరిగింది. మూఢనమ్మకాలు, అర్థంపర్థంలేని విశ్వాసాలతో గ్రామపెద్దలు అమానుషంగా వ్యవహరించారు. ఓ దళితుడిని చెరువులో పూడ్చిపెట్టడం వల్ల గ్రామానికి అరిష్టం పట్టుకుందని.. అందుకే వర్షాలు పడటం లేదంటూ పూడ్చిన శవాన్ని మళ్లీ వెలికి తీశారు. అంతే కాదు.. తల నుండి మొండెం వేరు చేశారు. తలను కాల్చేసి.. మొండాన్ని మాత్రం అలాగే వదిలేశారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గత ఏడాది డిసెంబర్‌లో కొమ్మాలకు చెందిన మిడతపల్లి బిక్షం ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోయాడు. శవాన్ని చెరువులోనే పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన జరిగి 9 నెలలు అయింది. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచే గ్రామంలో వర్షాలు పడటం లేదని.. అరిష్టం పట్టుకుందని భావించారు గ్రామపెద్దలు. వెంటనే పూడ్చిన శవాన్ని అక్కడి నుంచి తరలించాలంటూ.. బిక్షం కుటుంబ సభ్యుల్ని ఆదేశించారు. వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం జేసీబీ, ట్రాక్టర్ తీసుకెళ్లి..శవాన్ని వెలికి తీశారు. తల, మొండెం వేరు చేశారు. తలని కాల్చేసి.. కుళ్లిపోయిన మొండాన్ని అలాగే వదిలేశారు.
Also watch :
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com