పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో మైనార్టీలను చంపేస్తున్నారని ఆరోపించారు. హిందువులు, సిక్కులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. మైనార్టీ వర్గాలకు చెందిన యువతులను బలవంతంగా ముస్లిం మతంలోకి మారుస్తున్నారని మండిపడ్డారు. హిందువులు, సిక్కులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు భారత్‌కు వెళ్లిపోదామా అని మైనార్టీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పాక్ మైనార్టీలకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీలు భారతదేశానికి రావడానికి వీలుగా ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. హిందువులు, సిక్కులే కాదు ముస్లింలకు కూడా రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

బల్దేవ్ కుమార్, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన నాయకుడు. ఖైబర్ పంఖ్తుక్వా పరిధిలోని బారికట్ నుంచి గతంలో శాసనసభ్యునిగా పని చేశారు. ఇప్పటికే కశ్మీర్ విషయంలో ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంటా బయటా తల వాచిపోతోంది. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే పాక్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మైనార్టీలతో పాటు ముస్లింలు కూడా కష్టాలు పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్‌లో మైనార్టీల దుస్థితిపై సంచలన ఆరోపణలు చేసిన బల్దేవ్ కుమార్, భారత ప్రభుత్వం తనకు ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి ఆశ్రయమిస్తే జీవితంలో మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లనని చెప్పుకొచ్చారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story