వారికి న్యాయం జరిగేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు - చంద్రబాబు

ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గుంటూరులోని పార్టీ లీగల్ సెల్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన చంద్రబాబు.. సీఎం జగన్ 100 రోజుల పాలనపై మండిపడ్డారు. టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. వారిని ఊళ్ల నుంచి బహిష్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేయాలని, విధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వైసీపీ వర్గాల దాడుల కారణంగా ఇబ్బంది పడ్డ బాధితులను ఆదుకోవాలన్నదే తన ధృడ సంకల్పమన్నారు. అందుకే బుధవారం చలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చామన్నారు. వైసీపీ అరాచకాలను టీడీపీ వెలుగులోకి తెచ్చేదాక పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. బాధితులందరికీ న్యాయం జరిగేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతికి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేకపోయినా.. సెల్ఫ్ ఫైనాన్సింగ్‌తో రాజధానిని నిర్మించి.. ఆదాయం సమకూర్చాలని తాను ప్రయత్నించానని గుర్తు చేశారు.
Also Read :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com