మజ్లిస్‌ చేతిలో టీఆర్‌ఎస్ కీలు బొమ్మగా మారింది - కిషన్‌రెడ్డి

మజ్లిస్‌ చేతిలో టీఆర్‌ఎస్ కీలు బొమ్మగా మారింది - కిషన్‌రెడ్డి
X

బీజేపీ నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు ఆ పార్టీ నేతలు. సాయుధ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బైరాన్ పల్లి గ్రామ సమరయోధులను ఆహ్వానించి గౌరవించారు. ఢిల్లీ కాన్సిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సాయుధ తెలంగాణ పోరాట దృశ్యాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

టీఆర్‌ఎస్‌ పార్టీ మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మగా మారిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగిరినప్పుడు మాత్రమే.. తెలంగాణ పోరాట యోధులకు సరైన గుర్తింపు దక్కుతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా జరపడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ.. తెలంగాణ త్యాగధనుల చరిత్రను విస్మరిస్తోందని ఆరోపించారు.

కర్నాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవాలు నిర్వహిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు. కేసీఆర్‌ అహంకార ధోరణికి అంతం పలికే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Also watch :

Tags

Next Story