మిరాకిల్.. ప్రయాణిస్తున్న జీపులో నుంచి ఏడాది చిన్నారి కింద పడి..

రాత్రి పది గంటల ప్రాంతంలో ఓ ఫ్యామిలీ జీపులో ప్రయాణిస్తుంది. భార్యభర్తలతో పాటు ఆ కారులో ఓ ఏడాది పాప ఉంది. వారిద్దరూ గాఢ నిద్రలోమునిగిపోయారేమో.. ఆ పాప ఒక్కసారిగా వాహనంలోంచి రోడ్డుపై పడిపోయింది. ఆ చిన్నారి పడిన విషయం గ్రహించని తల్లిదండ్రులు అలానే వెళ్లిపోయారు. చిన్నారి ఏడుస్తూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది. స్వల్ప గాయాలతో పాప బయట పడింది. ఈ ఘటన కేరళలోని ఇదుక్కి జిల్లా రాజమలలో చోటు చేసుకుంది.
కుటుంబం అంతా కలిసి తమిళనాడులోని పళని ఆలయాన్ని సందర్శించి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో అటు వైపు ఎవరూ వెళ్లలేని పరిస్థితి. చివరకు ఓ అరగంట తరువాత అటుగా వెళ్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్.. పాపను అక్కున చేర్చుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Also Watch :
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com