ఆ విషయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

ఆ విషయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలపై గవర్నర్‌ తమిళసై.. ప్రశంసల వర్షం కురిపించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు పథకాలను అద్భుతమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మానవ నిర్మిత అద్భుతమంటూ కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు గవర్నర్‌ తమిళసై.

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు బాగున్నాయన్నారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిపోతుందని గవర్నర్‌ ఆకాంక్షించారు. రాష్ట్రం 14.84 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంతో కృష్ణా జలాలను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డులు నెలకొల్పిందన్నారు గవర్నర్‌. సేవల రంగంలో హైదరాబాద్ పురోగతి అద్భుతం అన్నారు. దేశానికి హైదరాబాద్ మార్గదర్శకంగా నిలుస్తోందంటూ కితాబిచ్చారు

Tags

Read MoreRead Less
Next Story