వినాయకుడి హుండీ ఎత్తుకెళ్ళిన..

X
By - TV5 Telugu |10 Sept 2019 1:08 PM IST
రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని ఓ వినాయక మండపంలో హుండీ చోరీ జరిగింది. గాంధీనగర్ లేబర్ అడ్డాలోని రాం భగీచా మండపంలో ఎవ్వరూ లేని సమయం చూసి, హుండీని ఎత్తుకెళ్లాడో దొంగ. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. మండప నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో సుమారు 20 వేల రూపాయలకు పైగా ఉంటాయని వారు చెప్పారు. పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
&
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com