బుసలు కొడుతూ జనం మధ్యలోకి శ్వేతనాగు

పాము తెల్లగా బంగారు వర్ణంలో మెరిసి పోతుండేసరికి.. అది భయంకరమైన నాగు పాము అని తెలిసినా ఫొటోల్లో బంధించారు కర్ణాటకలోని కడలూరి వాసులు. మరి అరుదుగా కనిపించే ఆ శ్వేత నాగు అందరి మధ్యలోకి వస్తే.. జనం బెదిరి పోతారనుకుంది కానీ ఇలా భయం, భక్తి ఏ మాత్రం లేకుండా ఫోటోలు దిగుతారనుకోలేదు. చుట్టూ జనం గుమిగూడేసరికి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొట్టింది. పడగ విప్పి కోపంగా చూసింది. కానీ అంతలోనే పాములు పట్టే వారు వచ్చి అత్యంత చాకచక్యంగా శ్వేతనాగుని పట్టుకున్నారు. సాధారణంగా నాగుపాములో కన్నా నల్ల త్రాచులో విషం ఎక్కువగా ఉంటుంది. ఇక తెల్లగా ధవళ వర్ణంలో మెరిసి పోయే శ్వేత నాగులో మరింత ఎక్కువగా విషం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనావాసంలో నాగుపాములు కనిపించడం సాధారణమే అయినప్పటికీ నల్ల త్రాచులు, శ్వేత నాగులు మాత్రం అడవుల్లోనే ఉంటాయి. అరుదుగా కనిపించడంతో జనం కూడా భయాన్ని పక్కనపెట్టి చూసేందుకు ఎగబడ్డారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com