ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు..

ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు..

విక్రమ్‌ ల్యాండర్‌తో కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా ట్రై చేస్తు న్నప్పటికీ కమ్యూనికేషన్ కుదరడం లేదు. ల్యాండర్‌ తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 21 తర్వాత ల్యాండర్‌తో కమ్యూనికేషన్ చేయడం కుదరదు. ఎందుకంటే, చంద్రునిపై ఒక లూనార్ డే టైమ్ మాత్రమే పని చేసేలా ల్యాండర్‌ను రూపొందించారు. ఒక లూనార్ డే అంటే 14 రోజులు. విక్రమ్‌ను చంద్రుడిపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన రోజు సెప్టెంబర్ 7. లూనార్ డే సెప్టెంబర్ 21న ముగుస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి లూనార్ నైట్ మొదలవుతుంది. చంద్రుడిపై రాత్రి సమయం అతి శీతలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 2 వేల డిగ్రీ సెల్సీయస్‌కు పడిపోతాయి. అలాంటి వాతావరణాన్ని తట్టుకోవడం ల్యాండర్ వల్ల కాదు. లూనార్ నైట్ ముగిసి మరో లూనార్ డే వచ్చిన తర్వాత కూడా ల్యాండర్ పని చేయలేదు. అందువల్ల సెప్టెంబర్ 21 ఇస్రోకు డెడ్‌లైన్. ఆలోపు కమ్యూనికేషన్ జరిగితే అద్భుతం జరిగినట్లే.

చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా గత శనివారం విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండవుతుండగా చివరి క్షణంలో ల్యాండర్‌‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. దాంతో విక్రమ్ ఆచూకీ గల్లంతైంది. ఐతే, ఆర్బిటర్ సాయంతో ల్యాండర్ జాడను గుర్తించారు. చంద్రుడి సౌత్ పోల్‌పై సాఫ్ట్ లాండింగ్ కావాల్సిన ల్యాండర్, హార్డ్ లాండింగ్ ఐనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో విక్రమ్ పడి ఉన్నట్లు కనుగొన్నారు. ల్యాండర్‌ ముక్కలు ముక్కలు కాలేదని, ఒకే భాగంగా ఉందని వెల్లడించారు. ల్యాండర్‌ పక్కకు ఒరిగిందే తప్ప చెక్కుచెదరలేదని చెప్పారు. ఐతే ల్యాండర్‌లో కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడంపైనే దానితో సంబంధాల పునరుద్దరణ ఆధారపడి ఉందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story