అంగన్‌వాడిలో పనిచేసే మహిళతో టీచర్ అక్రమ సంబంధం

అంగన్‌వాడిలో పనిచేసే మహిళతో టీచర్ అక్రమ సంబంధం

ఓ ఉపాధ్యాయుడి బుద్ధి గడ్డితింది. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారితప్పాడు. ప్రవిత్ర దేవాలయంలా భావించే బడిని నీచమైన పనికి వేదికలా మార్చాడు. శరవణన్‌ అనే వ్యక్తి తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పుదుఛత్రం సమీపంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఆ పాఠశాల పక్కనే ఉన్న అంగన్‌వాడిలోని మహిళతో శరవణన్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రోజూ పాఠశాలలోని బాత్రూంలో ఆ మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. దీన్ని గమనించిన విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు వచ్చారు. మహిళను, ఉపాధ్యాయుడు శరవణన్‌ను పట్టుకుని నిలదీశారు. తర్వాత శరవణన్‌‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జయరాజ్‌ స్పందించారు. "గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్‌ ఒక మహిళతో ఉండడం చూశాను అప్పుడే శరవణన్‌ను హెచ్చరించాను. అప్పటి నుంచి ఆ సంఘటన పునరావృతం కాలేద"ని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు శరవణన్‌ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story