అంతర్జాతీయం

దొంగతనం చేసి వికృత చర్య.. యువతి పక్కన నగ్నంగా..

దొంగతనం చేసి వికృత చర్య.. యువతి పక్కన నగ్నంగా..
X

దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. చివరకు జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగింది. క్యాలిఫోర్నియాలో చికో స్టేట్‌ యూనివర్సీటీలో చదివే 21 ఏళ్ల విద్యార్థిని నార్త్‌ క్యాలిఫోర్నియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 9వ తేదీన ఆమె ఉంటున్న ఇంటికి సమీపంలోని ఇంట్లో ఓ దొంగ చొరబడ్డాడు.

ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ దొంగిలించాడు. ఇంతలో పోలీసుల కంటపడి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పేందుకు యువతి గదిలోకి వెళ్లి ఆమె నిద్రిస్తుండగా ఆమె పక్కనే అతను కూడా బట్టలన్నీ విప్పేసి నిద్రించసాగాడు. కొద్దిసేపటి తరువాత యువతి లేచి చూడగా అతను కనిపించాడు. యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES