సడన్ గా అనంతపురం, కర్నూలులో ప్రత్యక్షమైన క్రికెటర్ గిల్‌క్రిస్ట్

X
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ సడన్ గా అనంతపురం, కర్నూల్ లో ప్రత్యక్షమయ్యాడు. అయితే అతనేదో క్రికెట్ ఆటకోసం వచ్చారనుకుంటే పొరపాటే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పరిశీలించేందుకు గిల్‌క్రిస్ట్ కర్నూలుకు వచ్చారు. అయితే పగిడిరాయి గ్రామానికి వస్తూ.. మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను సందర్శించాడు. ఈ సందర్బంగా స్టేడియం సదుపాయాలపై ఆరా తీశారు. క్రీడా వసతులు బాగా ఉన్నాయని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తారని వ్యాఖ్యానించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
