బాలాపూర్ వినాయకుడి లడ్డూ ను దక్కించుకున్న రామిరెడ్డి.. ఎంతో తెలుసా..?

బాలాపూర్ వినాయకుడి లడ్డూ ను దక్కించుకున్న రామిరెడ్డి.. ఎంతో తెలుసా..?

బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం పాట పూర్తయింది. కొలను రామిరెడ్డి రూ.17 లక్షల 60 వేల రూపాయలకు లడ్డూ ను దక్కించుకున్నారు. ఏడాదికేడాది బాలాపూర్ లడ్డూ భారీ ధరలు పలుకుతూ రికార్డులు సృష్టిస్తోండగా.. గతేడాది 16 లక్షల 60 వేలు పలికిన ఈ లడ్డూ.. ఈ సారి అంతకంటే ఎక్కువ ధర పలకడం విశేషం. లడ్డూ వేలంపాటలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. చివరకు కొలను రామిరెడ్డి వేలంలో గణనాధుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. కాగా లడ్డూ వేలం పాటను తిలకించేందుకు భారీగా వచ్చారు భక్తులు.

Tags

Read MoreRead Less
Next Story