మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ..! వీడియో వైర‌ల్

మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ..! వీడియో వైర‌ల్

ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా అనేక చోట్ల వింతలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా అర్జెంటీనాలో ఓ వింత జీవి జన్మించింది. విల్లా అనే గ్రామంలో ఆవు మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడ ముఖం మనిషిలాగే ఉండటంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుట్టిన ఈ ఆవుదూడకి మనిషిని పోలినట్టుగా చిన్న ముక్కు , చెవులు, తల ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మనుషుల్లో,జంతువుల్లో ఇలాంటి వింతలు చాలనే జరిగాయి. ఈ రకమైన వింత జననాల వెనుక శాస్త్రీయపరమైన కారణాలు వుంటాయని సైంటిస్టులు అంటున్నారు. ఈ వింత దూడ జననం వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు జన్యుశాస్త్ర నిపుణుడు నికోలస్ మ్యాగ్నాగో. డీఎన్ఏ మార్పుల వల్లే ఆ దూడ అలాంటి ఆకారంతో పుట్టి ఉంటుందని అంటున్నారు. గర్భంలో అది పూర్తిగా ఎదగక పోవడం వల్లే ఆ రూపంలో జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ఆవు దూడ పుట్టిన కొద్ది సేపటికే చనిపోయిందని ఆవు యజమాని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story