సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. శుభ్‌మన్ ఇన్.. రాహుల్ ఔట్..

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. శుభ్‌మన్ ఇన్.. రాహుల్ ఔట్..

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లకు జట్టులో చోటు కల్పించారు. ఐదుగురు బౌలర్లకు అవకాశం ఇవ్వగా ఆల్‌రౌండర్‌గా జడేజాకు ఛాన్స్ లభించింది. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని ఫార్మాట్లలో రాణించినందుకు గాను శుభ్‌మన్‌ గిల్‌కు జట్టులో చోటు దక్కింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా పంపించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్‌లకు టీమిండియాలో చోటు లభించలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఫిట్‌నెస్ లేకపోవడం, ఆశించిన రీతిలో రాణించకపోవడం ఉమేష్ యాదవ్‌కు మైనస్‌గా మారింది. సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా మూడు టెస్టులు, మూడు టి-20 మ్యాచ్‌లు ఆడనుంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story