అంతర్జాతీయం

చెవిలో పూలు కాదు.. పుట్టగొడుగులు.. డాక్టర్లు షాక్!

చెవిలో పూలు కాదు.. పుట్టగొడుగులు.. డాక్టర్లు షాక్!
X

వియత్నాంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు చెవిలో తరచు దురద వస్తుండేది. అయితే ఆ మహిళ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. దురద భరించలేనంతంగా రావడంతో డాక్టర్ల దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లింది. చెవి ఇన్ఫెక్షన్ వల్ల దురద పెడుతోందని వైద్యులు భావించారు. ఎందుకైనా మంచిదని ఎండోస్కోపీ విధానంలో వైద్యులు ఆమె చెవిలోకి కెమేరాను పంపి చూశారు. ఆమె చెవిలో పదుల సంఖ్యలో చిన్న చిన్న పుట్టగొడుగులు కనిపించడంతో.. డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవి మరింత పెరిగితే.. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన వైద్యులు వెంటనే వాటిని తొలగించారు.

ఇది ఒకరకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్.. ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయన్నారు డాక్టర్లు. మహిళ బీచ్‌లో ఆడుతున్నప్పుడు ఆ నీరు చెవిలో చేరి ఉంటుందని.. అందువల్ల పుట్టగొడుగులు ఏర్పడి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES