జాతీయవాద ముస్లిం సంస్థ జమాత్ ఉలేమా ఏ హింద్ కీలక ప్రకటన

ఆర్టికల్-370 రద్దు, కశ్మీర్ అంశంపై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జాతీయవాద ముస్లిం సంస్థ జమాత్ ఉలేమా ఏ హింద్ కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని జమాతే ఉలేమా హింద్ ప్రత్యేకంగా తీర్మానం చేసింది. ఆర్టికల్-370 రద్దును స్వాగతించిన జమాతే ఉలేమా హింద్, కశ్మీర్‌లో అభివృద్ధి-సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలని కోరింది. దేశ సమగ్రత, భద్రత విషయంలో తాము వెనక్కి తగ్గబోమని జమాతే ప్రధాన కార్యదర్శి మహమూద్ మదానీ స్పష్టం చేశారు. భారతదేశమే తమ దేశమనీ, దేశానికి తాము అండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లింలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించడానికి పాక్ కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. భారతదేశంలో మైనార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.
జమాతే ఉలేమా హింద్ 1919లో ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీతో కలసి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొంది. మతం ఆధారంగా దేశాన్ని భారత్, పాకిస్థాన్‌గా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో సంస్థలో విభేధాలు వచ్చాయి. కొందరు నాయకులు విడిపోయి జమాతే ఉలేమా ఇస్లామ్ పేరుతో కొత్త సంస్థను పెట్టుకున్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com