అసెంబ్లీ ఎన్నికల బరిలో ఫేమస్ రెజ్లర్?

ఫేమస్ రెజ్లర్ ఎన్నికల్లో పోటీ చేయబోతోందా..? రెజ్లింగ్‌లో పతకాల పండించిన ఆమె ఎలక్షన్ ఫీల్డ్‌లో ఓట్ల పంట పండించగలదా..? హర్యానాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. రెజ్లర్ బబితా ఫొగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. బీజేపీ క్యాండిడేట్‌గా ఆమె బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. బర్దా లేదా చారఖీ దాద్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని అంటున్నారు. ఆమె అభ్యర్ధిత్వం, పోటీ చేసే స్థానంపై బీజేపీ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
బబితా ఫొగట్ ఆగస్టు 13న బీజేపీలో చేరారు. తండ్రి మహవీర్ ఫొగట్‌తో కాషాయకండువా కప్పుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఆమె, ఉద్యోగానికి రాజీనామా చేసి కమలదళంలో భాగమయ్యారు. మోదీ సర్కారు విధానాలు నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్లు బబిత చెప్పారు. ఐతే, రాజీనామా ఆమోదం పొంద కుండానే పార్టీలో చేరడం బబితకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. చట్ట ప్రకారం ఆమె నుంచి 2 నెలల జీతాన్ని వసూలు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. బబితా ఫొగట్ ఆగస్టు 13న రాజీనామా చేయగా, ఈనెల 10వ తేదీన ఆమోదం పొందింది.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com