బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు.. 12,075 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు.. 12,075 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం పోస్టులు 12,075 ఉంటే.. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 777 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 17 నుంచి ప్రారంభంకానుంది. అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు దరఖాస్తు ఫీజు రూ.100. ప్రిలిమినరీ పరీక్షలను డిసెంబరులో, మెయిన్ పరీక్షను 2020 జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే, మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.

ఐబీపీఎస్ పరిధిలోని బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొత్తం పోస్టులు: 12,075 (తెలంగాణ 612, ఆంధ్రప్రదేశ్ 777).. అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థికి స్థానిక భాషపై పట్టు ఉండాలి. మాట్లాడడంతో పాటు చదవడం రాయడం వచ్చి వుండాలి.. వయసు: 01.09.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది.

also watch

Tags

Read MoreRead Less
Next Story