సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘానికి షాక్!

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘానికి  షాక్!

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం TBGKS కు గట్టి షాక్‌ తగిలింది. వ్యవస్థాపక అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్యతో పాటు 11 డివిజన్లలోని కేంద్ర ఉపాధ్యక్షులు, డివిజన్‌ ఇంఛార్జులు.. ఇతర నాయకులు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను మెయిల్‌ ద్వారా TBGKS గౌరవ అధ్యక్షురాలు కవితకు పంపించినట్లు తెలిపారు.

సింగరేణిలో TBGKS పురుడు పోసుకున్నప్పటి నుంచి సంఘం బలోపేతానికి కృషి చేశానని మల్లయ్య వెల్లడించారు. చీమల పుట్టలో పాములు చేరినట్టు వలసవాదులు చేరి భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్ల కార్మికుల సలహా మేరకు తన భవిష్యత్తును ప్రకటిస్తామని మలయ్య అన్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story